AP Weather Report: ఏపీని వీడని ముసురు.. మరో మూడ్రోజులు వర్షాలే

by Naga Rani Yarlagadda |

ఏపీ, యానాంలలో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

AP Weather Report: ఏపీని వీడని ముసురు.. మరో మూడ్రోజులు వర్షాలే
X

దిశ, వెబ్ డెస్క్: కొమరిన్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకూ ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావం కాస్త తగ్గింది. కానీ.. ఏపీకి మాత్రం మరో మూడ్రోజులు వర్షసూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణశాఖ. ఉత్తర కోస్తా, యానాంలలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.

ఇక రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. ఎల్లుండి కూడా ఒకట్రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాబట్టి రైతులు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Next Story