- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాపై సీఐడీ లుక్‌ఔట్ నోటీసులను ఎత్తివేయండి.. ఏపీ హైకోర్టులో ఎన్ఆర్‌ఐ యశస్వి పిటిషన్ దాఖలు
తనపై ఏపీ సీఐడీ ఇచ్చిన లుక్‌ఔట్ నోటీసును వెంటనే ఎత్తివేయాలని కోరుతూ.. ఎన్ఆర్‌ఐ యశస్వి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : తనపై ఏపీ సీఐడీ ఇచ్చిన లుక్‌ఔట్ నోటీసును వెంటనే ఎత్తివేయాలని కోరుతూ.. ఎన్ఆర్‌ఐ యశస్వి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిందని న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. లుక్‌ఔట్ నోటీసు ఉద్దేశం నెరవేరిందని, ఆ కారణం చేతనే విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్‌కు ఇబ్బందులుంటాయని, వెంటనే నోటీసును కొట్టివేయాలని కోర్టును కోరారు. దీనిపై ఉన్నతాధికారుల సూచనలు తీసుకోవాలని సీఐడీకి న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Next Story






