- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నంద్యాలలో లిఫ్ట్ ప్రమాదం.. తీవ్ర విషాదం
నంద్యాల మెయిన్‌బజార్‌లో చోటుచేసుకున్న లిఫ్ట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శారద అనే మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు..

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల మెయిన్‌బజార్(Nandyal Main Bazaar)లో చోటుచేసుకున్న లిఫ్ట్ ప్రమాదం(Lift Accident)లో తీవ్రంగా గాయపడిన శారద (50) అనే మహిళ ప్రైవేట్ ఆస్పత్రి(Private hospital)లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. స్థానిక అమ్మవారిశాలలో నిర్వహించిన 'వనిత' అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె, అక్కడ ఉన్న లిఫ్ట్‌లో ప్రమాదవశాత్తూ ఇరుక్కుపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పాలకమండలి నిర్లక్ష్యమే కారణం: పోలీసులకు భర్త ఫిర్యాదు
అమ్మవారిశాల పాలకమండలి నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణాలు కోల్పోయిందని శారద భర్త హరిబాబు తీవ్రంగా ఆరోపించారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన నంద్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.






