- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరాచక పాలన నుంచి విముక్తి..! మాజీమంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు
విశాఖ పట్టణ ప్రజలకు అరాచక పాలన నుంచి విముక్తి లభించిందని మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (TDP MLA Ganta Srinivas Rao) అన్నారు.

దిశ. వెబ్ డెస్క్: విశాఖ పట్టణ ప్రజలకు అరాచక పాలన నుంచి విముక్తి లభించిందని మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (TDP MLA Ganta Srinivas Rao) అన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (Greater Vishaka Municipal Corporation) మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీలో ఉన్న కార్పోరేటర్లు కొందరు పార్టీకి రాజీనామా చేసి, కూటమి నేతలతో జత కట్టారు. దీంతో జీవీఎంసీ మేయర్ (GVMC Mayor) పీటం కూటమి ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది.
దీనిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. వైసీపీ (YCP Party) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 4 ఏళ్ల వైసీపీ అవినీతి, అరాచక పాలన నుంచి విశాఖకు విముక్తి లభించిందని అన్నారు. అధికార మదంతో జీవీఎంసీ ఎన్నికల్లో (GVMC Elections) వైసీపీ సాగించిన దౌర్జన్యాన్ని, దారుణాలను ప్రజలెవరూ మర్చిపోలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పూర్తితో నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని, ప్రజారంజక పాలన అందించి జీవీఎంసీని రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు.
ఇక వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా, ఏకతాటిపై నిలిచి అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించిన కూటమి కార్పొరేటర్లకు, నాయకులకు అభినందనలు అని మాజీమంత్రి గంటా రాసుకొచ్చారు. కాగా జీవీఎంసీ లో మొత్తం 97 మంది కార్పోరేటర్లు ఉండగా.. ఈ రోజు జరిగిన సమావేశానికి 74 మంది కార్పోరేటర్లు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో విశాక మహా నగర పాలక సంస్థ మేయర్ పదవి కూటమి నేతలకు దక్కబోతోంది.






