కుప్పంలో Chandrababu Naidu ఎలా గెలుస్తారో చూస్తా : Peddireddy Ramachandra Reddy

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-01-06 13:48:54  IST  )

పుంగనూరులో తనను ఓడించడం చంద్రబాబు తరం కాదని రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

కుప్పంలో Chandrababu Naidu ఎలా గెలుస్తారో చూస్తా : Peddireddy Ramachandra Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : పుంగనూరులో తనను ఓడించడం చంద్రబాబు తరం కాదని రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాలేజీ చదువుకునే రోజులు నుంచే తనది చంద్రబాబుపై ఎప్పుడూ పై చేయి ఉండేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనను 'పుంగనూరు పుడింగి' అంటూ వ్యాఖ్యానించడంపై మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుడింగి అంటే అర్థమేమిటో చంద్రబాబుకు తెలుసా? అని ప్రశ్నించారు. పుడింగి అంటే బలవంతుడినని అర్థమని అది తెలియకుండా చంద్రబాబు తనను విమర్శిస్తు్న్నాడని చెప్పుకొచ్చారు. పుడింగి అనే ఒక్క మాటతోనే తనను ఆయనకంటే బలవంతుడు అనే విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారని అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో చూస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఓటుతోనే జిల్లాపరిషత్ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడం ఖాయమన్నారు. తనపై చంద్రబాబు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Next Story