- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం : సీఎం చంద్రబాబు
ప్రభుత్వ పాలనలో మెరుగైన ఫలితాలు వచ్చే ఫీడ్ బ్యాక్ కు ప్రాధాన్యం ఇస్తున్నాం. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ పాలనలో మెరుగైన ఫలితాలు వచ్చే ఫీడ్ బ్యాక్ కు ప్రాధాన్యం ఇస్తున్నాం. మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్డీపీ కేపీఐ, పబ్లిక్ పర్షపన్ గోల్స్ పై కలెక్టర్ల సదస్సు 5లో సీఎం ప్రసగించారు. కేవలం ప్రాసెస్ కోసం కాకుండా ఫలితాలు ఎలా వస్తున్నాయనే దానిపై పని చేయాలని సీఎం అన్నారు. డబ్ల్యూహెచ్ ఓ సస్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030కి సాధించాలని పెట్టుకుందన్నారు. భారత్ కూడా అందులో సిగ్నేటరీగా ఉందన్నారు. అందులోని పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కోసం మనం పని చేస్తున్నామన్నారు. ప్రజలకు సంతృప్తి లేకుండా పని చేస్తున్నాం అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేసే పనిలో ప్రజలు కలిసి వస్తున్నారా లేదా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఒకప్పుడు ఇవన్నీ కష్టంగా ఉండేవన్నారు. తాను నాలుగోసారి సీఎం అయ్యానని పేర్కొన్నారు. 90వ దశకంలో టెక్నాలజీని ప్యాషన్ గా దత్తత తీసుకున్నాం అన్నారు. ఈ ఆఫీస్, ఫైల్స్ డిస్పోసల్, పీజీఆర్ఎస్ వంటివి ఇప్పుడు వచ్చాయన్నారు.
ఎక్కువ గ్రీవెన్స్ వచ్చాయంటే ఆ విభాగం అంత బాగా పనిచేస్తుందని అర్థమన్నారు. గ్రీవెన్స్ లలో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అంచనాలు ఉంటాయన్నారు. పదిహేను వేల పింఛన్ ఇస్తే చాలదని కొందరు తనతో అన్నారని పేర్కొన్నారు. అందులో తప్పులేదన్నారు. కాకపోతే తాము వారికి సాధ్యాసాధ్యాలను అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాలన్నారు.
టెక్నాలజీతో ట్రాక్ చేస్తాం..
కొన్ని విభాగాల్లో వ్యవస్థాగత లోపాలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవస్థ దుర్వినియోగం వల్ల కొన్ని సమస్యలు వస్తాయన్నారు. వాటిల్లో రెవెన్యూ సమస్యలు ఒకటన్నారు. పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోసల్ అంటే ఫైల్ ట్రాన్స్ ఫర్ అనే అభిప్రాయానికి వచ్చారన్నారు. దీని వల్ల ఇంకా సంతృప్తి రాలేదన్నారు. ప్రస్తుతం అన్ని ఫైల్స్ ను ట్రాకింగ్ చేస్తున్నాం అన్నారు. దాని వల్ల ఏ అధికారి ఎలా డిస్పోసల్ చేశారో తెలుస్తుందన్నారు. అందరికీ జవాబుదారితనం ఉండేలా చూస్తున్నాం అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఫైల్ డిస్పోసల్ ట్రాక్ చేస్తామన్నారు. ఎవరైనా పొరపాటు చేస్తే అందులో తెలిసిపోతుందన్నారు.
డేటా డ్రివెన్ డెసీషన్ మేకింగ్
రానున్నది డేటా డ్రివెన్ డెసిసేషన్ మేకింగ్ గవర్నమెంట్ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాగా చేశామని అనుకుంటున్నా ఔట్పుట్ రావడం లేదన్నారు. ప్రజలు పనిని మెచ్చుకోకపోతే ఏదో లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. విభాగాల మధ్య పనితీరులో అంతరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తాను డేటాను విశ్లేషిస్తున్నానని.. దాని వల్ల కొంత అవగాహన వస్తుందన్నారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చిన కష్టపడి పని చేస్తున్నారు. మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. నోటిఫికేషన్ సమయంలో దానికి వ్యతిరేకంగా పిటిషన్లు, కంప్లైట్లు వచ్చి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్తే 31 కేసులు క్లియర్ చేసి ఉద్యోగాలు ఇచ్చామంటే అందుకే డేటా డ్రివెన్ విధానమే కారణమన్నారు. డీఎస్సీకి కూడా అదే విధంగా పరిష్కారం చూపామన్నారు. కానిస్టేబుళ్ల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో డిప్యూటీ సీఎంను బాబురావు అనే కానిస్టేబుల్ రోడ్డు కావాలని అడిగితే, అడిగిన వెంటనే రోడ్డును శాంక్షన్ చేయించామన్నారు.
అధికారాన్ని సద్వినియోగం చేయడం
బాధ్యతగల ప్రభుత్వం అంటే అధికారాన్ని సద్వినియోగం చేయడం అని సీఎం చంద్రబాబు నాయుడు కుండబద్ధలు కొట్టారు. పెట్టుబడులకు నారా లోకేష్ ఎప్పుడో బీజం వేస్తే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు. అమెరికాలోని ప్రముఖులతో నారా లోకేష్ చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. గూగుల్ దేశానికి వస్తే ఏపీనే గుర్తొచ్చిందన్నారు. కాస్ట్ ఎఫెక్ట్ ఎనర్జీ వల్ల 15 బిలయన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకొచ్చిందన్నారు.
డేటా లేక్ తీసుకొస్తున్నాం
డేటా లేక్ కూడా తీసుకొచ్చి సిటిజన్, ఫ్యామిలీ డేటా, రియల్ టైం ఫైల్స్ జనవరి నాటికి ఫైల్స్ ఆనైన్ లో ఉంచుతామన్నారు. అన్ని సేవలు కూడా ఆన్లైన్ కానున్నాయని వెల్లడించారు. ఆఫ్లైన్ విధానం పోవాలన్నారు. సెన్సార్, మైవోల్ట్ వివైజులు వాడుతున్నాం అన్నారు. రియల్ టైం డేటా కంప్యూటర్లో ఉందని, ఏఐను కూడా వినియోగస్తున్నామని ప్రకటించారు. హార్డ్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యమని తెలియజేశారు.
కేంద్ర ప్రయోజిత... సంక్షేమ పథకాలు
కేంద్ర ప్రయోజిత పథకాలు డిఫాల్ట్ అయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి.. వాటి లెక్కలు సరి చేసి తిరిగి అమలులోకి తెచ్చామన్నారు. పథకాలను సద్వినియోగం చేసి మౌలిక వసతులను డెవలప్ చేయాలన్నారు. పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలించాలన్నారు. మొదటి ప్రాధాన్యం సంక్షేమానికి ఇవ్వాలన్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీనిచ్చామన్నారు. పింఛన్లను తప్పకుండా ఫస్ట్ కి ఇస్తున్నాం అన్నారు. పేదల కోసే పని చేస్తున్నాం అన్నారు. పింఛన్లు ఇవ్వలేని పరిస్థితిని సరిదిద్దామన్నారు. తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలందరికీ పథకాన్ని వర్తింపజేశాం. ఆ పిల్లలే బాధ్యతగల పౌరులు తయారువుతారన్నారు. అన్నదాత సుఖీభవ రెండు పర్యాయాలు జయప్రదం చేశాం. దీపం 2, స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకం విజయవంతం చేశామని గుర్తు చేశారు.
అండగా నిలవాలి
విశాఖలో 13.26 లక్షలు కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగాయన్నారు. నిర్ణయాలు తీసుకొని అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను చేసే పరిస్థితికి రాష్ట్రం వచ్చిందన్నారు. ఏ కలెక్టర్ ఏ ప్రాజెక్ట్ ఎంత స్పీడ్ గా పూర్తి చేశారనేది పర్యవేక్షిస్తున్నాం అన్నారు. రాష్ట్ర డెవలెప్మెంట్ కు సహకరించే వారికి అండగా నిలవాలని సూచించారు.
సాధికారత కోసం
సాధికారత సాధించే దిశగా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలకు కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్, మైనారిటీలకు సాధికారులను చేసేందుకు ఫోకస్ చేశామన్నారు. సెర్ప్ ముప్పై సంవత్సరాల క్రింద ప్రారంభించామన గుర్తు చేశారు. అర్బన్, మెప్మాలను బలపరుస్తున్నాం అన్నారు. మహిళా శిశు సంక్షేమం, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇండ్లకు కనీస అవసరంపై చర్చిద్దాం. పీ4 వంటి వినూత్న కార్యక్రమానికి బీజం వేస్తున్నాం అన్నారు. పీ3 ఇప్పటికే అమలు చేస్తున్నాం అన్నారు. విధానాలను అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సంస్కరణల తరువాతే దేశానికి గుర్తింపు
1991 వరకు ప్రపంచం భారత దేశాన్ని గుర్తించలేదన్నారు. మన దేశం ఏం చేయలేదని ప్రపంచ దేశాలు అనేవి అన్నారు. అయితే 1991 తరువాత ఆలోచన విధానం మారిందని, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తరువాతనే అన్ని సాధ్యపడ్డాయన్నారు. సిద్ధాంతాలు మనిషికి తిండి పెట్టవన్నారు. విలువలు, సిద్ధాంతాలు వేరన్నారు. టెక్నాలజీ వచ్చిన తరువాత ప్రపంచ పటంపై భారత్ తన సత్తా చాటిందన్నారు. యువత అధికంగా ఉండే దేశంగా కూడా గుర్తింపు పొందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్థిర ప్రభుత్వం ఏర్పరిచారన్నారు. ప్రపంచం గర్వించేలా ముందుకు సాగుతున్నామని వివరించారు. భారత్ ను నిర్లక్ష్యం చేయలేమని ప్రపంచం అంటోందన్నారు. సమర్థవంతంగా పని చేయడం కోసం విధానాలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
కలెక్టర్లే ప్రచారకర్తలు
కలెక్టర్లే ప్రభుత్వానికి ప్రచారకర్తలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వారి బుర్రలు కంప్యూటర్ చిప్ లా వేగంగా పని చేయాలన్నారు. ఏపీవైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఏయిరో స్పేస్ ప్రాజెక్టలు, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటివి ఎన్నో వస్తున్నాయన్నారు. సంజీవని వంటి డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ విజయవంతమైన గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందన్నారు. వాటన్నింటినీ విజయవంతం చేసే బాధ్యత కలెక్టర్ల భుజాలపై ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల వల్ల ప్రతి పౌరుడు ప్రయోజనం పొందేలా చూడాలని సూచించారు. రాజకీయపరమైన అంశాలను రాజకీయ నాయకులు చూస్తారని.. వారి సహకారం కూడా పొందాలని కోరారు.






