Leopard: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-12 05:52:13  IST  )

తిరుమలలో భక్తులను చిరుత హడలెత్తించింది...

Leopard: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో భక్తులను చిరుత(Chiruta) హడలెత్తించింది. రెండో ఘాట్ రోడ్డులో వెళ్తున్న భక్తులకు చిరుతపులి కనిపించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే టీటీడీ(TTD) అధికారులకు సమాచారం అందుకున్నారు. స్పాట్‌కు చేరుకున్న అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. చిరుత పాదముద్రలను పరిశీలిస్తున్నారు. ఘాట్ రోడ్డులో భక్తుల రాకపోకల వైపు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

కాగా ఇటీవల కాలంలో తిరుమలలో క్రూరమృగాల సంచారం ఎక్కువ అయింది. అలిపిరి నడకమార్గంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చిరుతపులి, కొండశిలువ, ఎలుబంట్లు ఇటీవల కాలంలో ఎక్కువగా సంచరిస్తున్నాయి. దీంతో భక్తులు భయపడిపోతున్నారు. గత ఘటనలను గుర్తు చేసుకుంటూ మరింత ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు.

Next Story