తిరుపతిలో మరోసారి చిరుత కలకలం.. ఎస్‌వీయూ క్యాంపస్‌లో సంచారం

by Malleboina Mahesh |

గత కొద్ది నెలలుగా తిరుమల తిరుపతిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. నిత్యం ప్రజావాసాల్లోకి వస్తున్న చిరుత పులులు వీధి కుక్కలు, పశువులు, ఇతర జంతువులపై దాడులు చేస్తున్నాయి.

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం.. ఎస్‌వీయూ క్యాంపస్‌లో సంచారం
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది నెలలుగా తిరుమల తిరుపతిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. నిత్యం ప్రజావాసాల్లోకి వస్తున్న చిరుత పులులు వీధి కుక్కలు, పశువులు, ఇతర జంతువులపై దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమరాల్లో రికార్డు కావడంతో షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. మరోసారి తిరుపతిలో చిరుత సంచారం కలకలం గా మారింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్‌వీయూ) క్యాంపస్‌లో చిరుతపులి ప్రత్యక్షమవడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్యాంపస్‌లోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న నాటుకోళ్ల షెడ్‌పై రాత్రి సమయంలో చిరుత దాడి చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో క్యాంపస్ పరిసర ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిరుత సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని, అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్ రోడ్లపై ప్రయాణాలను తాత్కాలికంగా నిషేధించారు. విద్యార్థులు, ఉద్యోగులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు.

Next Story