- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. వీడియో వైరల్
తిరుమల (Tirumala) నడక మార్గంలో చిరుత (Cheetah) భయం వీడటం లేదు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) నడక మార్గంలో చిరుత (Cheetah) భయం వీడటం లేదు. వరుస చిరుత సంచారంతో భక్తులు (Devotees) తీవ్ర కలవరానికి గురవుతున్నారు. సోమవారం అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి కలకలం సృష్టించింది. గాలిగోపురం దుకాణాల వద్ద అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే చిరుతల సంచారంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నడక మార్గంలో భక్తులకు మరిన్ని ఆంక్షలను అమలు చేస్తోంది.
కాగా, అలిపిరి నడక మార్గంలో 2023లో కౌశిక్, లక్షితల పై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఆంక్షలు విధించారు. వరుసగా చిరుతలు సంచరిస్తుండటంతో భక్తులను గుంపులు గుంపులుగానే నడక మార్గంలో అధికారులు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నడక మారాల్లో నో ఎంట్రీ పెట్టారు. అలాగే నడక మార్గంలో భక్తులకు స్వీయ రక్షణ కోసం ఊత కర్రలను ఇస్తోన్నారు.






