Tirumala:అలిపిరి నడకదారిలో చిరుత సంచారం.. టీటీడీ కీలక నిర్ణయం

by Jakkula.Mamatha |

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

Tirumala:అలిపిరి నడకదారిలో చిరుత సంచారం.. టీటీడీ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే.. ఇటీవల తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులకు చిరుత పులి కనిపించింది. దీంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళన(Panic)కు గురయ్యారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో కారులో వెళుతున్న భక్తులకు(Devotees) వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహారీ గోడ పై చిరుత పరిగెత్తడానికి గమనించి వీడియో తీశారు. అయితే తిరుమల(Tirumala)లో అలిపిరి నడకదారిలో చిరుతలు కనిపించడం ఇదే తొలిసారి కాదు.

ఆ రోడ్డు వైపుగా అడవి జంతువులు తిరుగుతుండడం, భక్తుల పై దాడి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ(TTD) కీలక సూచనలు చేసింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. నడకదారి రాత్రి 9:30 గంటలకు మూసివేస్తారు. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story