- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్వీ వర్సిటీలో చిరుత కలకలం.. చాకచక్యంగా బంధించిన అటవీశాఖ
తిరుపతి వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత తిరుగుతున్నట్లు గమనించిన సిబ్బంది, స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం(Tirupati Venkateswara Veterinary University) ఆవరణలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత(Cheetah) తిరుగుతున్నట్లు గమనించిన సిబ్బంది, స్థానికులు అటవీశాఖ అధికారుల(Forest officials)కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. పరిస్థితిని సమీక్షించి చిరుత పులిని సురక్షితంగా బంధించారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బందితో పాటు చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన చిరుతను అధికారులు వెంటనే ఎస్వీ జూపార్క్‌కు తరలించారు.
చిరుతకు పరీక్షలు
ప్రస్తుతం జూపార్క్‌లో అటవీశాఖ సంరక్షణలో ఉన్న చిరుతకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలు పూర్తయి, చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత.. దానిని సురక్షితంగా శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.






