మూలపల్లిలో చిరుత సంచారం.. భయం గుప్పిట్లో జనం

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా మూలపల్లిలో చిరుత సంచారం కలకలం రేగింది...

మూలపల్లిలో చిరుత సంచారం.. భయం గుప్పిట్లో జనం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) మూలపల్లి(Mulapalli)లో చిరుత(Cheetah) సంచారం కలకలం రేగింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక అటవీ ప్రాంతం నుంచి గ్రామం వైపు వచ్చినట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. స్పాట్ చేరుకుని చిరుత కోసం అధికారులు గాలిస్తున్నారు. చిరుతను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరగా బంధించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అప్పటి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పొలాలకు వెళ్లే సమయంలో మరింత అప్రమత్తత అవసరమని చెప్పారు. రాత్రి వేళలో ఒంటరిగా బయటకు రావొద్దని సూచించారు.

Next Story