- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో చిరుత సంచారం.. భక్తులను నిలిపివేసిన భద్రతా సిబ్బంది
by Naga Rani Yarlagadda |
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలినడకన తిరుమలకు చేరుకునే క్రమంలో.. 400వ మెట్టు వద్ద చిరుతను చూసినట్లు భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలినడకన తిరుమలకు చేరుకునే క్రమంలో.. 400వ మెట్టు వద్ద చిరుతను చూసినట్లు భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది భక్తులను కొద్దిసమయం నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. పరిసరాల్లో చిరుత జాడ లేకపోవడంతో భక్తులను అనుమతించారు.
ఎస్వీ గెస్ట్ హౌస్ వద్ద ప్రమాదం
మరోవైపు తిరుమలలో ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎస్వీ గెస్ట్ హౌస్ వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టింది. వెంటనే కారులో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో లోపల ఉన్న భక్తులు క్షేమంగా బయటపడ్డారు. కారు వెనుక సీట్లలో కూర్చున్న భక్తులకు గాయాలు కాగా.. వారిని చికిత్సకోసం అశ్వినీ ఆస్పత్రికి తరలించారు.
Next Story






