- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుద్రంపల్లిలో చిరుత కలకలం: ఆవుదూడపై దాడి.. మృతి
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా రుద్రంపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి జనవాసాల్లోకి ప్రవేశించిన చిరుత.. ఆవుదూడపై మెరుపు దాడి చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram District) రుద్రంపల్లి(Rudrampalli) గ్రామంలో చిరుతపులి (Leopard)సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి జనవాసాల్లోకి ప్రవేశించిన చిరుత, ఒక ఆవుదూడపై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దూడ అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున పశువుల పాక వద్ద దూడ మృతదేహాన్ని చూసిన యజమాని, గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
చిరుత సంచారంతో గ్రామస్థులు పొలాలకు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా వణికిపోతున్నారు. పశువులపైనే కాకుండా మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని మరియు రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






