అల్లూరి జిల్లాలో చిరుత అడుగుజాడలు

by Thanuru Gopichand |

అల్లూరి జిల్లాలో (Alluri District) చిరుత పులి అడుగుజాడలు కనిపించాయి. దీంతో సమీప ప్రాంతాల్లో కలకలం రేగింది.

అల్లూరి జిల్లాలో చిరుత అడుగుజాడలు
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి జిల్లాలో (Alluri District) చిరుత పులి అడుగుజాడలు కనిపించాయి. దీంతో సమీప ప్రాంతాల్లో కలకలం రేగింది. చిరుత (Leopard) సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి జిల్లా పరిధిలోని జీకేవీధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డు రేయిన్ గేజ్ వద్ద చిరుతపులి సంచారంపై అధికారులకు సమాచారం అందింది. దీంతో సీలేరు రేంజ్ అటవీశాఖ అధికారి ఎస్.వెంకట్ రావు ఆదేశాల మేరకు అటవీ అధికారులు తనిఖీలను చేశారు. డిప్యూటీ రేంజ్ అధికారి సతీష్ బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి చిరుత పులి సంచరించే ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న జంతువు అడుగుజాడలను పరిశీలించారు. వారి తనిఖీలో రేయిన్ గేజ్ సమీపం నుంచి చిరుతపులి వెళ్లినట్లు వెల్లడైంది. అనంతరం సమీపంలోని గాలికొండ పంచాయితీ పరిధి గ్రాాల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంద పర్యటించారు. చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు.

సప్పర్ల ఘాట్ రోడ్డులో ఎవరూ ఒంటిరిగా తిరగకూడదని స్పష్టం చేశారు. ఏదైనా అవసరం నిమిత్తం వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలని గ్రామస్తులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిస్సా వైపు చిరుత పులి వెళ్లినట్లు తమ పరిశీలన నిర్ధారణ అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించేవారు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

Next Story