- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరుత మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్
by Jakkula.Mamatha |
ఏపీ(Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి మండలం పొన్నిటిపాళ్యంలో వేటగాళ్లు ఉచ్చులో చిక్కుకుని చిరుత(cheetah) మృతి చెందిన సంగతి తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి మండలం పొన్నిటిపాళ్యంలో వేటగాళ్లు ఉచ్చులో చిక్కుకుని చిరుత(cheetah) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిరుతతో పాటు దాని గర్భంలోని రెండు కూనలు కూడా మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన పై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటన పై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు భారీగా పొన్నిటిపాళ్యం గ్రామానికి చేరుకున్నారు. ఈ తరుణంలో నిందితులను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే చిరుత మృతికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Next Story






