- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాంపస్ సమీపంలోచిక్కిన చిరుత.. ఎక్కడంటే..
గత మూడు నెలలుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది.

దిశ, డైనమిక్ బ్యూరో : గత మూడు నెలలుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనుక వైపు ఏర్పాటు చేసిన బోనులో చిరుత అర్థ రాత్రి చిక్కుకుంది. ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వీ జూ పార్కు తరలించారు. ఎస్వీయూ క్యాంపస్పరిసర ప్రాంతాల్లో కొంత కాలంగా చిరుతలు సంచరిస్తున్నారు. పక్కన అటవీ ప్రాంతం ఉండడంతో ఇక్కడకు వస్తున్నాయి. దీంతో విద్యా ర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు బోనును ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌లో అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఈ చిరుతలు ఎస్వీయూ విద్యా ర్థుల వసతి గృహాల వద్ద, జూ పార్క్ రోడ్డులోని దేవ్ లోక్ స్థల ఆవరణలో సంచరించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అలిపిరి, జూ మార్గంలోని ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా మరో చిరుత బోనులో చిక్కడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.






