అర్ధరాత్రి చెంచుపెంటపై దాడి చేసి మూడేళ్ల చిన్నారిని లాక్కుపోయిన చిరుత

by Muthe.Rajitha |

శ్రీశైలం ఆలయం సమీపంలోని ఓ చెంచుపెంటలో దారుణ ఘటన జరిగింది.

అర్ధరాత్రి చెంచుపెంటపై దాడి చేసి మూడేళ్ల చిన్నారిని లాక్కుపోయిన చిరుత
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం ఆలయం సమీపంలోని ఓ చెంచుపెంటలో దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రుల పక్కన నిద్రపోతున్న మూడేళ్ళ చిన్నారిని చిరుత లాక్కుపోయింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి చిరుత చెంచుపెంటపై దాడి చేసి తల్లిదండ్రుల పక్కన నిద్రపోతున్న మూడేళ్ళ చిన్నారిని అడవిలోకి లాక్కుపోయింది. అయితే క్షణాల్లో అప్రమత్తమైన చెంచులు చిరుతను వెంబడించగా.. శివారు ప్రాంతంలో చిన్నారిని వదిలేసి అడవిలోకి పారిపోయింది.

తీవ్రంగా గాయపడిన చిన్నారిని సున్నిపెంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా 70 ఏళ్లుగా చిన్నారుట్ల పెంటలో చెంచులు నివాసం ఉంటున్నప్పటికీ.. ఇంత వరకు ITDA విద్యుత్ సౌకర్యం కల్పించలేదని మండిపడ్డారు. శ్రీశైలం-దోర్నాల రహదారిపై వాహనాలు ఆపి గంటసేపు ధర్నా చేసారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని హామీలు నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Next Story