తిరుమలలో ఇంట్లోకి దూరిన చిరుతపులి.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

తిరుప‌తిలో శుక్ర‌వారం రాత్రి చిరుత‌పులి సంచారం క‌ల‌క‌లం రేపింది. అర్థ‌రాత్రి ఓ లెక్చ‌ర‌ర్ ఇంట్లోకి చిరుత‌ దూరింది. మొద‌ట ఇంటికి చుట్టూ ఉన్న కంపౌండ్ వాల్ పై నుండి తొంగి చూసిన చిరుత త‌ర‌వాత చిన్న‌గోడ‌పై నుండి ఇంట్లోకి దూకేసింది.

తిరుమలలో ఇంట్లోకి దూరిన చిరుతపులి.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుప‌తిలో శుక్ర‌వారం రాత్రి చిరుత‌పులి సంచారం క‌ల‌క‌లం రేపింది. అర్థ‌రాత్రి ఓ లెక్చ‌ర‌ర్ ఇంట్లోకి చిరుత‌ దూరింది. మొద‌ట ఇంటికి చుట్టూ ఉన్న కంపౌండ్ వాల్ పై నుండి తొంగి చూసిన చిరుత త‌ర‌వాత చిన్న‌గోడ‌పై నుండి ఇంట్లోకి దూకేసింది. లోప‌ల ఒక పెంపుడు కుక్క క‌ట్టేసి ఉండగా దానిపై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించింది. ఇంతలో ఇంట్లో నుండి ఓ మ‌హిళ బ‌య‌ట‌కు రావ‌డం, ఇంట్లోవాళ్లు కేక‌లు పెట్ట‌డంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీసింది. స‌మ‌యానికి మ‌హిళ వ‌చ్చి ఉండ‌క‌పోతే చిరుత కుక్క‌పై దాడి చేసేది. అంతే కాకుండా అది కుక్క కోస‌మే ఇంట్లోకి దూరిన‌ట్టు క‌నిపిస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే మూడు రోజుల నుండి చిరుత‌పులి సంచిరిస్తోంద‌ని స్థానికులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. చిరుత సంచారంతో బ‌య‌ట‌కు వెళ్లాలి అంటేనే భ‌యం వేస్తోంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

Next Story