సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు.. ట్వీట్ వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-19 11:44:10  IST  )

ఏపీ సీఎం చంద్రబాబుపై దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు...

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు.. ట్వీట్ వైరల్
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu)పై దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు తిరుగులేని శక్తి అంటూ అభివర్ణించారు. అభివృద్ధి పట్ల చంద్రబాబుకు అచంచలమైన అంకితభావం ఉందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఎప్పుడూ నూతన విధానాలు కోసం పరితపిస్తుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రబాబుపై ఆనంద్ మహీంద్ర పొగడ్తల వర్షాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తెగ సంబరపడిపోతున్నారు. ఇక విమర్శకులైతే తమ స్టైల్లో స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఆనంద్ మహీంద్రకు వ్యతిరేకంగా కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

ఆనంద్ మహీంద్ర ట్వీట్...

Next Story