- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ..మంత్రి లోకేష్ ప్రకటన
ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే ఏపీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే ఏపీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీలో ఉన్న వర్సిటీలలో ఖాళీగా ఉన్న మొత్తం 4300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి నుంచి వచ్చిన డిమాండ్లపై చర్చించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. కాలేజీలు, వర్సిటీలలో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యా సంస్థల పని వేళలు పూర్తయిన తర్వాత రాజకీయోతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల విద్యార్థిలకు సాయం అందిస్తామన్నారు లోకేష్.






