- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాన్యులపై మరో పిడుగు.. రాష్ట్రంలో పాల ధరల పెంపు
ఏపీలో ప్రముఖ డెయిరీ సంస్థ విజయ పాల ధరలను పెంచింది. లీటర్ పాలపై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది...

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడింది. ఏపీ(Ap)లో ప్రముఖ డెయిరీ సంస్థ విజయ పాల(Vijaya Milk) ధరల(Price)ను పెంచింది. లీటర్ పాలపై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్(Krishna Milk Union) అధికారికంగా ప్రకటించింది. పాల సేకరణ ఖర్చులు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు, రవాణా భారం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని డెయిరీ వర్గాలు తెలిపాయి. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయని పేర్కొన్నాయి.
నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం
అయితే ఈ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనంగా భారం పడనుంది. అర లీటర్ ప్యాకెట్‌పై రూ. 1 పెరగగా, లీటరుకు రూ. 2 పెరిగింది. అయితే, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో మాత్రం ఈ పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. అలాగే ముందస్తుగా మంత్లీ కార్డ్స్ తీసుకున్న వినియోగదారులకు ఏప్రిల్ 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని, ఆ తర్వాత కొత్త ధరలు అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.






