Breaking: LAWCET & PGLCET–2025 ఫలితాలు విడుదల

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-19 10:29:14  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది లా సెట్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే

Breaking: LAWCET & PGLCET–2025 ఫలితాలు విడుదల
X

దిశ,వెబ్‌‌డెస్క్: లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా లా సెట్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జూన్‌ 5వ తేదీన ఏపీ లాసెట్‌-2025ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు.

ఈ పరీక్షకు మొత్తం 27,253 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ఇప్పటికే విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ తరుణంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు విడుదలైనట్లు తాజాగా ప్రకటించారు. 27,253 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 20,826 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. 95 శాతానికి పైగా ఉత్తీర్ణులు కాగా, అందులో అమ్మాయిలే అధికంగా ఉన్నారని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ర్యాంకు కార్డుల కోసం అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx సందర్శించండి. మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పరీక్షల్లో విజయవంతమైన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

Twitter Link

Next Story