- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Valabhaneni vamsi: వంశీకి వరుస షాక్‌లు.. తాజాగా ఆయనపై భూకబ్జా కేసు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Valabhaneni vamsi) కి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆయన అవినీతి కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్(SIT) ఏర్పాటు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు బయటకు వస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గన్నవరం, వీరవల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేసినట్లు కేసు నమోదు అయింది. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వీరవల్లి లో కూడా ఆయనపై మరో కేసు నమోదయింది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో దళితుడిని కిడ్నాప్చేశారనే ఆరోపణలతో వంశీని పది రోజుల కిందట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్విధించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్‌జైలులో రిమాండ్‌ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయనను తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా.. పోలీసులు రెండు పీటీ వారెంట్లు జారీ చేశారు. దీంతో ఆయనకు బెయిలు లభించే అవకాశాలు సన్నగిల్లాయి. వంశీ వ్యవహారంలో నిన్న ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన అవినీతి కుంభకోణాలపై విచారణ చేపట్టేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఈ రోజు సిట్రంగంలోకి దిగింది. ఈక్రమంలో ఆయనపై గన్నవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పది కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. సిట్ఏర్పాటుతో మరింత మంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నారు.






