కడపలో అర్థరాత్రి దౌర్జన్యం: జేసీబీతో ఇల్లు కూల్చివేత

by Thanuru Gopichand |   (  Updated:2026-01-27 04:56:43  IST  )

ఆర్థిక లావాదేవీల నెపంతో దారుణానికి ఒడిగట్టిన దుండగులు.

కడపలో అర్థరాత్రి దౌర్జన్యం: జేసీబీతో ఇల్లు కూల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్ : కడప (Kadapa) నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఎర్రముక్కపల్లి (Yerramukkapalli) ప్రాంతంలో అర్థరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు జేసీబీతో (JCB) వచ్చి ఒక ఇంటిని అక్రమంగా కూల్చివేయడం (House Demolition) స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రముక్కపల్లిలో భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం అర్థరాత్రి కొందరు దుండగులు వారి ఇంటికి వద్దకు వచ్చారు. ఇంట్లోని వారికి బలవంతంగా బయటకు లాగారు. జేసీబీని వెంట తీసుకొచ్చిన సదరు దుండగులు విచక్షణ రహితంగా ఇంటిని కూల్చివేయడం ప్రారంభించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా కనికరించలేదు. ఈ ఆకస్మిక పరిణామంతో స్థానికంగా కలకల రేగింది. ప్రజలు భయాందోళలనకు గురయ్యారు. బాధితుల ఆక్రందనలతో పరిసరాలంతా హోరెత్తాయి. సమచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంటి కూల్చివేతలకు ఆర్థిక లావాదీవీలే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఒక్కసారిగా హల్ చల్ చేయడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story