7 సంస్థలకు భూ కేటాయింపులు: మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-19 15:28:41  IST  )

పీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన భేటీలో కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేశారు....

7 సంస్థలకు భూ కేటాయింపులు: మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం(Cabinet Sub-Committee) భేటీ ముగిసింది. ఈ భేటీలో కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో బ్యాంకు ఉద్యోగుల నివాసాలకూ భూమి కేటాయించామని చెప్పారు. రెయిన్ బ్రో చిల్డ్రన్ హాస్పిటల్‌కు రెండు ఎకరాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాజధాని భూ సమస్యల పరిశీలన, పలు సంస్థలకు భూములు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు.

Next Story