- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నారా లోకేష్‌పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కీలక ఆరోపణలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ అక్రమంగా ఇసుక అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులు బంద్ చేస్తామని చెప్పి.. రాష్ట్రాన్ని తాగుబోతుల రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని స్వయంగా ప్రధాని మోడీనే ప్రశంసించారని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ సీఎం జగన్ మానసపుత్రికగా పేర్కొన్నారు. జనాల్లో జగన్‌కు వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతోనే కూటమిగా వస్తున్నారని మండిపడ్డారు. ఎంత గుంపులుగా వచ్చినా జగన్‌ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారని అన్నారు.
Read More...
తండ్రిని పోగొట్టుకున్న అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన లోకేశ్