7 కేజీల బంగారం.. రూ.5 కోట్ల కరెన్సీతో అలంకరణ

by Naga Rani Yarlagadda |

తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

7 కేజీల బంగారం.. రూ.5 కోట్ల కరెన్సీతో అలంకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖలోని ఓల్డ్ టౌన్ పరిధిలో గల కురుపాం మార్కెట్ ప్రాంతంలో దసరా ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. అక్కడ 148 ఏళ్ల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తున్నారు. 9వ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో తీర్చిదిద్దారు. 7 కేజీల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, 12 కేజీల వెండి, రూ.5 కోట్ల నగదుతో అమ్మవారిని నిండుగా అలంకరించారు. అలాగే ఆలయంలో 250 మంది మహిళలతో కోటి కుంకుమార్చన నిర్వహించారు. మహాలక్ష్మిదేవిగా అమ్మవారిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదని భక్తులు తెలిపారు.

Next Story