- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: లేడీ అఘోరీ అరెస్ట్.. పీఎస్‌కు తరలింపు
గుంటూరులో లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో లేడీ అఘోరీ(Aghori)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్(Nallapadu Police Station)కు తరలించారు. హిందూ ఐక్య పోరాట వేదిక నేత అనిల్ బెహేరా(Anil Behera) చేసిన అనుచిత వ్యాఖ్యలపై అఘోరీ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అఘోరీ నిరసన చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అఘోరీకి సూచించారు. అఘోరీ ఎంతకీ వినకపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అఘోరీని అరెస్ట్ చేసిన విషయం స్థానిక హిజ్రాలకు తెలియడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అఘోరీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాగా లేడీ అఘోరీ కొద్ది రోజులుగా ఏపీ(Ap)లో హల్ చల్ చేస్తున్నారు. మార్చి 3న కూడా నెల్లూరు జిల్లా చిలకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద ఆవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. డైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సడెన్‌గా తణుకులో ప్రత్యక్షమయ్యారు. అఘోరా బాబాగా పిలవబడుతున్న రాజేష్ నాథ్‌పై అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌నాథ్ ఇంటి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి వదిలివేశారు. తాజాగా గుంటూరులో ప్రత్యక్షమై హల్ చల్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






