- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాబాత్ హై ఎమ్మెల్యే సాబ్.. మస్తు స్టెప్పులు వేశారు!
అప్పుడప్పుడు సరదాలు కూడా ఉండాలి మరి.

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయ నాయకులంటే ఎప్పుడూ సీరియస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు, అధికారిక కార్యక్రమాలే కాదు. అప్పుడప్పుడు ఆటవిడిది కూడా అవసరమే. అందుకే ఏపీకి చెందిన చాలా మంది రాజకీయ నాయకులు వీలైనప్పుడల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతూ ఉంటారు. న్యూఇయర్ వేడుకల సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి డాన్సు వేసి అందరినీ అలరించారు. తనలో కూడా ఓ సాధారణ వ్యక్తి ఉన్నాడని చెప్పకనే చెప్పారు. సీరియస్ మాటలే కాదు ఆటపాటల్లో కూడా తాను తీసిపోనని నిరూపించుకున్నారు. ఇదే కోవలో వైసీపీకి చెందిన అంబటి రాంబాబు కూడా తన సరదా చేష్టలతో అందరినీ అలరిస్తుంటారు. ఇంకొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలతో సంబంధం లేకుండా తమ మనసుకు ఆనందాన్ని కలిగిస్తూనే ఇతరులకు సంతోషాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు అదే కోవలోకి మరో ఎమ్మెల్యే చేరిపోయారు. ఆయన చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఆయన తన కార్యకర్తలతో కలిసి డాన్స్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన తన ఇన్ స్టా గ్రాంలో స్వయంగా వీడియోను షేర్ కూడా చేశారు.
అయితే ఈ వీడియోలో ఇటీవల విడుదలైన దురంధర్ సినిమా పాటకు ఆయన టీం సభ్యులతో కలిసి డాన్స్ చేశారు. రహ్మాన్ డకేత్ ఎంట్రీ సాంగ్ కు ఫుల్ స్వింగ్ లో ఆడారు. వీడియో గురించి జంగారెడ్డిగూడెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణానికి వెళ్తున్న క్రమంలో వీడియో తీశామన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో మూసి ఉన్న మార్గాన్ని తెరిచే క్రమంలో ఒత్తిడిని (Tantrum) తట్టుకోవడానికి సరదాగా టీం సభ్యులు, అక్కడకు వచ్చిన నాయకులతో కలిసి రీల్ చేశామని తెలిపారు.






