- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోళగుందలో విషాదం.. ప్రాణం తీసిన పెళ్లి సంప్రదాయం
ఆదోని మండలం హనువాళు గ్రామానికి చెందిన రాజు.. తల్లిదండ్రులు గోరంట్ల, ఈరమ్మలతో కలిసి హోళగుందలో ఉంటున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పెళ్లికి పెద్దల మధ్య జరిగిన గొడవకు నిండు ప్రాణం బలైంది. తమ మతం ప్రకారమంటే, తమ మతాచారం ప్రకారమే పెళ్లి జరగాలని ఇరువైపులా పెద్దలు పట్టుబట్టడంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కర్నూల్ జిల్లా హోళగుందలో జరిగింది.
ఆదోని మండలం హనువాళు గ్రామానికి చెందిన రాజు.. తల్లిదండ్రులు గోరంట్ల, ఈరమ్మలతో కలిసి హోళగుందలో ఉంటున్నాడు. హోళగుంద మండలం ఎండీ హళ్లికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇరుకుటుంబాల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇద్దరి మతాలు వేరుకావడంతో.. యువతి తరపు పెద్దలు తమ మతాచారం ప్రకారమే పెళ్లి చేయాలని పట్టుబట్టారు. దాంతో చేసేది లేక రాజు తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. కానీ అనూహ్యంగా పెళ్లికి ఒకరోజు ముందు రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటని ఆరా తీయగా.. యువతి మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆ పని చేసినట్లు తేలింది. ఇంత చిన్న కారణానికి అలాంటి నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రులు, యువతి కన్నీటి పర్యంతమయ్యారు.






