- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన
by Bhoopathi Nagaiah |
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదోని నియోజకవర్గంలో దిశ పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళ నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

X
దిశ ప్రతినిధి, ఆదోని: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదోని నియోజకవర్గంలో దిశ పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దిశ పత్రిక ఆదోని ప్రతినిధి రమేష్ రెడ్డి గత రెండురోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ముగ్గుల పోటీలకు ఆహ్వానం పలికారు. మహిళలు ఇంటి ముందు వేసే ముగ్గులో ‘దిశ పత్రిక’ వచ్చేలా వేయాలన్నారు. అలాగే ప్రకృతి, సమాజానికి ఉపయోగపడే ముగ్గులు వచ్చేలా పంపించాలన్నారు. బెస్ట్ మూడు ముగ్గులను ఎంపిక చేసి ఆదోని పట్టణ ప్రముఖుల చేత బహుమతులు అందజేస్తామన్నారు. ఈ ప్రకటనకు ఆదోని మహిళల నుంచి భారీ స్పందన వచ్చింది. వందలాది మంది భోగి, సంక్రాంతి రోజు తాము తీర్చిదిద్దిన ముగ్గులను ‘దిశ’కు పంపించారు. వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ప్రతినిధులు నేడు బహుమతులు అందజేయనున్నారు.
Next Story






