- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిలిచిన ఇష్టకామేశ్వరి యాత్ర.. భక్తుల నిరాశ
శ్రీశైలం అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు...

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం(Srisailam) అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి ఆలయ(Ishtakameshwari Temple) సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. నిబంధనల ప్రకారం భక్తులు కేవలం అటవీశాఖ(Forest Department) అనుమతించిన వాహనాల్లోనే వెళ్లాల్సి ఉంది. అయితే ఒక వ్యక్తికి మాత్రమే ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు ఈడీసీ (EDC) అధికారులు అనుమతించడంతో వివాదం మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ను ఎలా అనుమతిస్తారంటూ అటవీశాఖ అధికారులతో స్థానిక చెంచు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.
వివాదం ఉద్రిక్తం
ఈ వివాదం కాస్తా ముదరడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అటవీశాఖ సిబ్బంది తక్షణమే స్పందించి, ఆలయానికి వెళ్లేందుకు టికెట్లు తీసుకున్న భక్తులకు వారి రుసుమును తిరిగి ఇచ్చివేశారు. వివాదం పూర్తిగా సద్దుమణిగి, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
భక్తుల తీవ్ర నిరాశ
అడవి మధ్యలో యాత్ర ఆగిపోవడంతో సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులు, డ్రైవర్ల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు త్వరితగతిన సమస్యను పరిష్కరించి దర్శనాలను పునరుద్ధరించాలని కోరారు.






