- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలులో ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య!
by Ramesh Naini |
తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గార్గేయపురం వద్ద ఉన్న చెరువులో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులను రాజేశ్వరి (35), ఆమె కుమారులు సుకుమార్ (6), అబ్రహం (3)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.
కలహాలే కారణమా?
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగానే మనస్తాపానికి గురైన రాజేశ్వరి, తన ఇద్దరు పసిపిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






