- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాయలసీమ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం.. విషయం బయటికి రాకుండా..
కర్నూల్ జిల్లాలోని రాయలసీమ యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతం నిద్రలేచింది.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్స్ చెప్పినట్లే షర్ట్ బటన్ పెట్టుకుంటా అని జూనియర్ బదులివ్వడం ర్యాగింగ్ కు దారితీసినట్లు తెలుస్తోంది. కర్నూల్ జిల్లాలోని రాయలసీమ యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతం నిద్రలేచింది. బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. అతనిపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారు. షర్ట్ బటన్ పెట్టుకుని క్లాస్ కు వెళ్లు అని సీనియర్లు చెప్పగా.. సరే బటన్ పెట్టుకుంటానులే అని ఇచ్చిన సమాధానమే అతని పాలిట శాపమైంది. తిరిగి సమాధానం చెప్పడంతో సీనియర్స్ కోపంతో అతన్ని హాస్టల్ లో 136వ నంబర్ రూమ్ లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది.
దీంతో తనపై జరిగిన దాడి గురించి తాలూకా పీఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. విద్యార్థి సంఘాల నాయకులు అతనికి, సీనియర్లకు మధ్య సంధి కుదిర్చేందుకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళ్లారని సమాచారం. ఇంత చేసినా బాధిత విద్యార్థి రాజీకి ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై వీసీ వెంకట బసవరావు స్పందించారు. యూనివర్శిటీలో విద్యార్థుల గొడవ, ర్యాగింగ్ విషయాలేవీ తమ దృష్టికి రాలేదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. కాగా.. యూనివర్శిటీలో ఇలాంటి ఘటన రెండోసారి జరగడంతో మిగతా విద్యార్థులు భయపడుతున్నారు.






