- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీనామా చేస్తా: అఖిల ప్రియ సంచలన ప్రకటన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది...

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ(Allagadda)లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే భూ అఖిల ప్రియ(MLA Bhu Akhilapriya) బీట్యాక్స్ వసూలు చేస్తు్న్నారంటూ కొందరు వైసీపీ(Ycp) నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె సీరియస్ అయ్యారు. సంచలన సవాల్ విసిరారు. తాను బీట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. టీడీపీ(Tdp) కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ అహోబిలం(Ahobilam)గా అక్రమంగా నిర్మిస్తున్న సత్రాలు, హోటళ్లకు తాను అనుమతించానని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అహోబిలం సర్పంచ్‌గా వైసీపీకి చెందిన వారే ఉన్నారని అఖిల ప్రియ తెలిపారు. ఎలాంటి నిర్మాణాలకైనా స్థానిక సర్పంచ్, గ్రామ పంచాయతీ తీర్మానాలు అవసరమనే విషయం కూడా వైసీపీ నాయకులకు తెలియదని ఎద్దేవా చేశారు. అహోబిలంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నాయకులు రెడీనా అని భూమా అఖిల ప్రియా సవాల్ విసిరారు.






