- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి ఆస్తి కోసం రోడెక్కిన 75 ఏళ్ల వృద్ధురాలు
కన్నతండ్రి ఆస్తిలో తనకు రావాల్సిన వాటా కోసం ఓ వృద్ధురాలు ఏకంగా అర్ధ శతాబ్ద కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తన తండ్రికి ఉన్న 22 ఎకరాల భూమిలో తనకు దక్కాల్సిన 10 ఎకరాల వాటా కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన 75 ఏళ్ల రామక్క రోడెక్కింది...

దిశ, వెబ్ డెస్క్: కన్నతండ్రి ఆస్తి(Fathers Property)లో తనకు రావాల్సిన వాటా కోసం ఓ వృద్ధురాలు(Elderly Woman) ఏకంగా అర్ధ శతాబ్ద కాలంగా న్యాయపోరాటం(Legal Battle) చేస్తున్నారు. తన తండ్రికి ఉన్న 22 ఎకరాల భూమిలో తనకు దక్కాల్సిన 10 ఎకరాల వాటా కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన 75 ఏళ్ల రామక్క రోడెక్కింది. ముగ్గురు కుమార్తెలకు రూపాయి కూడా ఇవ్వకుండా హక్కుగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
నాకు పూర్తి హక్కు ఉంది
హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిపై కుమార్తెగా తనకు పూర్తి చట్టబద్ధమైన హక్కు ఉందని రామక్క అంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు నందవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చట్టం మద్దతు ఉన్నా, సొంత కుటుంబ సభ్యుల నుంచే న్యాయం కోసం దశాబ్దాలుగా ఎదురుచూడాల్సిన పరిస్థితిపై రామక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.






