- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nandikotkuru | చిన్నమ్మా.. పసికందు మీద ఎందుకంత కోపం
అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరైనా అల్లారుముద్దుగా చూసుకుంటారు. తమ ఇంట దైవం పుట్టినంత సంబురపడతారు.

దిశ, వెబ్ డెస్క్ : అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరైనా అల్లారుముద్దుగా చూసుకుంటారు. తమ ఇంట దైవం పుట్టినంత సంబురపడతారు. జన్మనిచ్చిన తల్లికే కాదు.. బిడ్డ తండ్రికి.. కుటుంబ సభ్యులకు పట్టలేనంత ఆనందంగా ఉంటుంది. కానీ కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో (Nandikotukur) ఒక చిన్నమ్మకు ఏమైందో తెలియదు. తన సోదరి కూతురుకు పుట్టిన ఆడబిడ్డను తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో (Government Hospital) వదిలేసింది. తన చేతులారా ఆ పసిబిడ్డను అనాథను చేసే ప్రయత్నం చేసింది. నందికొట్కూరులోని సాయిబాబాపేటలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరి మనసులను చలింపజేసింది.
వివరాల్లోకి వెళ్తే కొణిదెల గ్రామానికి చెందిన శివమ్మ తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శివమ్మకు చిన్నమ్మ వరుసయ్యే శేషమ్మ ఆ పసిబిడ్డను తీసుకెళ్లి ప్రభుత్వాసుపత్రిలో వదిలేసింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. విషయాన్ని గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటలుకు వచ్చిన పోలీసులు పరిస్థితిని గమనించారు. సీసీటీవీ (CCTV) ఫుటేజీ ఆధారంగా బిడ్డను వదిలి వెళ్లింది శేషమ్మ అని గుర్తించారు. ఆమె ఆచూకీతో పాటు బిడ్డ తల్లి ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు. కేవలం 3 గంటల వ్యవధిలో బిడ్డ తల్లి ఆచూకీని కనుగొన్నారు. అనంతరం శివమ్మకు ఆడబిడ్డను భద్రంగా అప్పగించారు. పోలీసుల (Police) చర్య పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శివమ్మకు చిన్నమ్మ అయిన శేషమ్మ మరి ఇలా ఎందుకు చేసిందో.. ఆమె మనసుకు ఆడబిడ్డ అంటే భారంగా అనిపించిందో.. వారికే తెలియాలి.






