- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుగా మారిన ఎమ్మెల్యే పార్థసారథి
by Vemula.Srinu Prasad |
ఆదోని నియోజకవర్గంలోని డాణాపురం గ్రామంలో శాసనసభ్యులు డా. పీవీ పార్థసారథి వాల్మీకి రైతుగా మారి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పొలంలోకి స్వయంగా దిగి రైతులతో కలిసి సాలు పట్టి విత్తనాలు నాటి వ్యవసాయం పట్ల తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు..

X
దిశ, ఆదోని ప్రతినిధి: ఆదోని నియోజకవర్గంలోని డాణాపురం గ్రామంలో శాసనసభ్యులు డా. పీవీ పార్థసారథి వాల్మీకి రైతుగా మారి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పొలంలోకి స్వయంగా దిగి రైతులతో కలిసి సాలు పట్టి విత్తనాలు నాటి వ్యవసాయం పట్ల తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అన్నదాత కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయం మన సంస్కృతికి మూలాధారమని, రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Next Story






