- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Devanakonda: వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా దేవనకొండలో చోటుచేసుకుంది..

X
దిశ, దేవనకొండ: వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా దేవనకొండలో చోటుచేసుకుంది. ఆదోనికి చెందిన మహిళకు దేవనకొండ గ్రామానికి చెందిన చాకలి నరేష్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అయితే భర్తతోపాటు కుటుంబ సభ్యులు వేధింపులు తట్టుకోలేక బాధితురాలు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు అన్న నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త మామతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.
Next Story






