- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం జెన్కో కాలనీలో చిరుత కలకలం.. కోడి కోసం విఫలయత్నం
by Ramesh Naini |
శ్రీశైలం మండలం సున్నిపెంట జెన్కో కాలనీలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం మండలం సున్నిపెంట జెన్కో కాలనీలో ఆదివారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఓ ఇంటి ముందుకొచ్చిన చిరుత.. కోళ్ల కోసం ఏర్పాటు చేసిన ఇనుప బాక్సులో ఉన్న ఓ కోడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలమై వెనుదిరిగింది. ఈ దృశ్యాలను సదరు ఇంటి సభ్యులు తమ సెల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సున్నిపెంట శివారు ప్రాంతాల్లో ఇటీవల తరచుగా చిరుతలు సంచరిస్తుండటంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతల బారి నుంచి తమను రక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story






