- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kurnool | ఎద్దుల బండిని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు
కర్నూలు జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సు ఎద్దుల బండిని (Bullock Cart) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సు ఎద్దుల బండిని (Bullock Cart) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మంత్రాలయం నుంచి రాయచూరు వైపు గ్రీన్ లైన్ ట్రావెల్స్ కు చెందిన ఓ ప్రైవేటు బస్సు ప్రయాణిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాధవరం (Madhavaram) వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. బస్సు ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని ఢీ కొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. వాటిలో ఒకటి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి గురైన ఎద్దుల బండిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక ఘటనతో స్థానికులు తొలుత షాక్ కు గురయ్యారు. వెంటనే సహాయ చర్యల్లోకి దిగారు. సంఘటనా స్థలం వద్దకు చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందుతోందని.. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలియ వస్తోంది.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మాధవరం బ్రిడ్జిపైన ఈ దుర్ఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. అంతేకాకుండా వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ప్రమాదం అనంతరం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బ్రిడ్జిపైన నిలిచిపోయింది. ఎద్దుల బండి కూడా అక్కడే ఉండిపోయింది. ఏపీ, కర్ణాటకల మధ్య అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఇటు ఏపీ, అటు కర్ణాటక వైపు వెళ్తే వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు దుర్ఘటనా స్థలానికి చేరుకోవడమే కాకుండా ఘటన జరిగిన పరిసరాలను పరిశీలించారు. దుర్ఘటన కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు కూడా చర్యలను చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






