- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు ఆటో డ్రైవర్లకు పిచ్చి ముదిరింది.. తాట తీసిన పోలీసులు
రోడ్డుపై పిచ్చి వేషాలు వేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లకు కర్నూలు పోలీసులు బుద్ధిచెప్పారు...

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరు డ్రైవర్లు పట్టించుకోవడంలేదు. విచ్చల విడిగా రోడ్డుపై అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. అంతేకాదు రోడ్డు అన్న మాట మర్చి స్టంట్స్ చేస్తున్నారు. బైక్, ఆటో అనే తేడా లేకుండా పోటీలు పడుతున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై విచిత్రమైన వేషాలు వేస్తూ అతిపొకడలకు పాల్పడుతున్నారు. ఒంటి చక్రంపై వాహనాలు నడుపుతూ స్థానికంగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటన కర్నూలు టౌన్‌లో జరిగింది.
రోడ్డుపై విచిత్రమైన వేషాలు
కర్నూలు మెయిర్ రోడ్డుపై ముగ్గురు ఆకతాయి ఆటో డ్రైవర్లు రోడ్డుపై రెచ్చిపోయారు. అతివేగంగా ఆటోలు నడిపి హల్ చల్ చేశారు. ఒక టైరుపై ఆటోలు నడుపుతూ అత్యుత్సాహం చూపారు. ఆటో డ్రైవర్ల ఆకృత్యాలను వెనుక వెళ్తున్న వాహనదారులు వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఈ వీడియోలను లోకల్ పోలీస్ శాఖకు షేర్ చేశారు.
ఆటో డ్రైవర్లపై నెటిజన్ల ఆగ్రహం
అయితే నెటిజన్లు మాత్రం ఆటో డ్రైవర్లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి స్టంట్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. ప్రమాదాలు జరిగి ఉంటే ఆటో డ్రైవర్లే, కాదు రోడ్డుపై వెళ్తున్న వారి కుటుంబాల్లో కూడా విషాదాలే మిగిలేవని చెప్పారు. ఇప్పటికైనా ఆటోడ్రైవర్లతో పాటు వాహనదారులందరూ అప్రమత్తంగా ఉండాలని, రహదారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ముగ్గురు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






