- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
by Thanuru Gopichand |
సోమవారం పురస్కరించుకొని శ్రీశైలం దేవస్థానానికి (Srisailam Devasthanam) భక్తులు పోటెత్తుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సోమవారం పురస్కరించుకొని శ్రీశైలం దేవస్థానానికి (Srisailam Devasthanam) భక్తులు పోటెత్తుతున్నారు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు (Devotees) తరలివస్తున్నారు. భ్రమరాంభ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడ్డారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆలయాధికారులు ముందస్తు చర్యలను చేపట్టారు. అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిలిపివేశారు. బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని తెలిపారు.
Next Story






