- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 19 మంది మృతి: హోంమంత్రి అనిత
బస్సు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 19 మంది మృతి చెందారని హోంమంత్రి అనిత తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు బస్సు ప్రమాదం(Kurnool Bus Incident) దురదృష్టకరమని హోంమంత్రి అనిత(Home Minister Anitha) అన్నారు. బస్సు ప్రమాద బాధితులను కర్నూలు జీజీహెచ్(GGH)లో ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఉదయం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. బైక్‌ను 20 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో స్పార్క్ వచ్చిందని తెలిపారు. ఇద్దరు పిల్లలు సహా 19 మంది చనిపోయారని చెప్పారు. 27 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. మృతుల్లో ఆరుగురు ఆంధ్రప్రదేశ్, ఆరుగురు తెలంగాణ వాసులు ఉన్నారన్నారు. ఏపీ మృతులకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెప్పారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు కస్టడీలో తీసుకున్నారని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులను తాను ఆదేశించామని తెలిపారు. విచారణలో అన్ని అంశాలు తేలుతాయని, 3 శాఖలతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.






