- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ విగ్రహంపై గుర్తు తెలియని దుండగుల దాడి
by Javid Pasha |
నంద్యాల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగింది.

X
దిశ, కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని బొమ్మల సత్రం సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేశారు. దీంతో అంబేద్కర్ విగ్రహానికి చెందిన చేతి వేలు, ముక్కు భాగం దెబ్బతిన్నాయి. ఉదయం గమనించిన కొందరు అంబేద్కర్ వాదులు ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంఘం జిల్లా నాయకుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు అగ్రవర్ణాలే కారణమని ఆరోపించారు. దుండుగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ను అవమానపరచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






