కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన... 9కి చేరిన మృతుల సంఖ్య

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసింతే. అయితే ఈ ప్రమాదం మరో ప్రాణాన్ని బలితీసుకుంది...

కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన... 9కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగిన విషయం తెలిసింతే. అయితే ఈ ప్రమాదం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(Government General Hospital)లో చికిత్స పొందుతున్న తేజస్విని (15) అనే బాలిక శుక్రవారం కన్నుమూసింది. వైద్యులు శ్రమించినా ఫలితం దక్కలేదు. తేజస్విని మరణంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. దీంతో బాలిక కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

ఆసుపత్రిలో మరికొందరికి చికిత్స

కాగా ఈ ప్రమాదంలో గాయపడిన మరికొందరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అతివేగం లేదా అజాగ్రత్తే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story