Nara Lokesh: ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన బిల్డప్ బాబాయి జగన్

by Vemula.Srinu Prasad |

రోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన ఘనత బిల్డప్ బాబాయి జగన్‌కే దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు...

Nara Lokesh: ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన బిల్డప్ బాబాయి జగన్
X

దిశ, నంద్యాల, బనగానపల్లె: ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన ఘనత బిల్డప్ బాబాయి జగన్‌కే దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అంతకుముందు కొవెలకుంట్ల మండలంలోని అమడాల గ్రామం మెట్ట వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సౌదరదిన్నె కొవెలకుంట్ల, భీమునిపాడు, కంపమల్ల మెట్ట నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని దోర్నిపాడు గ్రామంలో పాదయాత్ర కొనసాగింది. నారా లోకేష్‌కు భూమా నాగిరెడ్డి తనయుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొవెలకుంట్ల మండలంలో ప్రజలతో మాట్లాడుతూ ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన బిల్డప్ బాబాయి జగన్ అని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే జగన్ మాత్రం ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకురావడమేంటని ప్రశ్నించారు. రానున్నది తమ ప్రభుత్వమని, అందరికీ మెరుగైన అందించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామిచ్చారు.

Next Story