డివైడర్ దాటి ఎదురువైపు రోడ్డుపైకి దూసుకెళ్లిన బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

by Vemula.Srinu Prasad |

డివైడర్ దాటి ఎదురువైపు రోడ్డుపైకి ప్రైవేటు బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటన నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో జరిగింది. అయితే ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ...

డివైడర్ దాటి ఎదురువైపు రోడ్డుపైకి దూసుకెళ్లిన బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: డివైడర్ దాటి ఎదురువైపు రోడ్డుపైకి ప్రైవేటు బస్సు(Private Trravels Bus) దూసుకెళ్లింది. ఈ ఘటన నంద్యాల జిల్లా పాణ్యం(Panyam) సమీపంలో జరిగింది. అయితే ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి తిరుపతి(Tirupati)కి వెళ్తున్న బస్సు ఇంట్రిసిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పాణ్యం సమీపంలోకి వెళ్లగానే టైర్ పేలి పంక్ఛర్ అయింది. అయితే రన్నింగ్‌లో ఉండటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో బస్సు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఎదురుగా వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. పరిస్థితి పర్యవేక్షించారు. ప్రయాణికులందరినీ మరో బస్సులో సురక్షితంగా తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story