తెల్లారేసరికి తుంగభద్ర నదిలో మహిళ మృతదేహం కలకలం

by Bhoopathi Nagaiah |

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఓ మహిళా మృతదేహం కలకలం సృష్టించింది.

తెల్లారేసరికి తుంగభద్ర నదిలో మహిళ మృతదేహం కలకలం
X

దిశ, మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఓ మహిళా మృతదేహం కలకలం సృష్టించింది. ఉదయాన్నే పుణ్య స్నానాలకు వెళ్లిన వారికి నదిలో మృతదేహం కనిపించడంతో భయాందోళన చెందారు. బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మంత్రాలయం గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పుష్కర ఘాట్, సంత మార్కెట్ ఘాట్ మధ్య నదిలో మృతదేహం తేలియాడుతూ స్థానికులు కనిపించింది. 55 ఏళ్ల వరకు వయసున్న మహిళ కాళ్లకు చెప్పులతో నదిలో బోర్ల పడిపోయి ఉన్నది. ప్రమాదవశాత్తు ఆమె నదిలో పడిపోయిందా..? లేక ఇంకా ఏదైన జరిగిందా అనేదానిపై స్పష్టత లేదు. మృతురాలి అడ్రస్, ఇతర వివరాలు ఏమీ తెలియరాలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న VRO... వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రాలయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మహిళా ఫొటోలను మీడియాకు రిలీజ్ చేశారు. వివరాలు తెలిసిన వాళ్లు మంత్రాలయం సీఐ 9121101151, ఎస్సై 9121101152 నంబర్లను సంప్రదించగలరని పోలీసులు కోరారు.

Next Story